add_circle Create Playlist

Telugu Kids & Family Podcast

కోయిల గడియారం
అది ఒక అద్భుతమయిన కోయిల గడియారం! ఆ గడియారంలో గంటకోసారి నిజమయిన కోయిల వచ్చి కూడా కూస్తుంది. మాలకి అదంటే ఏంటో ప్రాణం! తన రోజు గడవాలంటే ఆ కోయిల కూయాల్సిందే మరి! ఆ కోయిల బద్దకిస్తే ఏమయిందో వినండి మరి!
బొమ్మల పిన్ని
ప్రేమ పంచడానికి అయినవారే కానక్కర్లేదు. ఒక వీధి వ్యాపారి బొమ్మల పిన్నిగా మారి పిల్లలకి నచ్చిన బొమ్మలని ఇవ్వడమే కాకుండా, వారి అందమయిన భవిత గురించి కలలు కనే ప్రోత్సాహం ఇచ్చేది. మీ జీవితంలో అలాంటి బొమ్మల పిన్నిలు కచ్చితంగా ఉండే ఉంటారు, ఈ కథ విని వారిని స్మరించుకోండి. మీ వూరు వెళితే వారిని పలకరించండి. With Background Music Without Background Music
కాబూలీవాలా [ Kabuliwala ]
కాబూలీవాలా, ఒక కాబూలీ వాడు కలకత్తా వీధుల్లో తినుబండారాలు అమ్ముకునే వాడు మిన్నీ అన్న పాపతో చేసిన స్నేహం కథ ఈ కథ. ఆత్మీయత, బంధం పెనవేసుకున్న కథ ఇది. ఠాగూర్ గారిని విశ్వకవి అని ఎందుకు అంటారో బహుశా ఈ కథ వింటే మనకి నిరూపణ అవుతుంది కాబోలు!  With Background Music Without Background Music
చిన్న ఎర్రబడి [ A Small Redcart]
ఒక చిట్టడివిలో రెండు పిల్లకోతులు చిరు అల్లరి చేస్తుంటే వాళ్ళ అమ్మ కోతి ఒక సలహా ఇచ్చింది. మొదట ఆ సలహా నచ్చకపోయినా తరువాత వారు ఆ సలహా పాటించడమే కాకుండా ఒక అద్భుతంచేసి తల్లిని ఎంతో ఆనందింపచేసారు! ఆ అద్భుతం ఏమిటో వింటే కానీ తెలీదు మరి!
సూర్యకన్యలు [ Damsels of Sun ]
అది ఒక అందమయిన ఆకాశం. ఆకాశంలో ఎర్రని సూర్యుడు వెలుగును విరజిమ్ముతున్నాడు. ఆ వెలుగు రేకలు ఒక్కొక్కటి ఒక్కొక్క అందమయిన సూర్య కన్యలుగా మారి భూమి మీద పడుతున్నారు! ఆ సూర్యకన్యలకు వచ్చిన ఒక వింత కోరిక ఫలితమే ఈ కథ! విని ఆనందిస్తారు కదూ?
రామాయణం ఉత్తరకాండ - సమాప్తం
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
లవకుశలు రామ కీర్తన చేస్తున్నారు. రాముడు వారు సీత కొడుకులని గుర్తించాడు. వాల్మీకి మహర్షికి సీతను తన పవిత్రత నిరూపించుకోమని, అయోధ్యకు పిలిపించాడు. సీత తానూ కల్మషం లేనిదైతే భూమాత వచ్చి తనను తీస్కెళ్లిపోతుందని కోరింది. వెంటనే భూమాత సీత దేవిని తీస్కువెళ్లిపోయింది. లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు తమ తమ పిల్లలకు రాజ్యభారాలు అప్పగించేశారు. రాముడు రాజ్యాన్ని లవకుశలకు అప్పగించి అవతారం చాలించారు. సర్వేజనా సుఖినోభవంతు!
రామాయణం ఉత్తరకాండ – 12
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
రాముడు అశ్వమేధ యాగం చేయతలిచాడు. అశ్వ మీద యాగ ఫలితములు చర్చించుకుంటూ ఇలుడు స్త్రీగా మారుట, అశ్వమేధ యాగం చేసి తిరిగి పురుషుడిగా మారుట వంటి విశేషములు చర్చించుకుని వనరులను, రాక్షసులను పిలిచి అశ్వమేధ యాగం చేశారు.
రామాయణం ఉత్తరకాండ – 11
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
శత్రుజ్ఞుడు అద్భుతమైన యుద్ధం చేసి లావానుడిని చంపేశాడు. కొన్ని రోజులకు ఒక బ్రాహ్మణుడు అకాల మరణం చెందిన తన పుతృడిని రాముడు వద్దకు తీసుకువచ్చిన సారాను వేడాడు. అకాల మరణాలు ఊరికే రావని దేశంలో ఏదయినా యుగధర్మానికి విరుద్దమయిన పని ఏదైనా జరిగితే ఆలా జరుగుతుందని వసిష్ఠ మహాముని సెలవిచ్చారు. అది ఏమిటో దానితో పాటు మరిన్ని సూక్ష్మ కథలు వినండి.
రామాయణం ఉత్తరకాండ – 10
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
రాముడు కొలువుదీరి ఉండగా పలు రకాల సమస్యలను పరిష్కరించాడు. ఒకనాడు కొలువుకు నూరుకు పైగా మునులు వచ్చి లవణాసురుడనే రాక్షసుడు తమను బాధపెడుతున్నారని, వాడి బాధనించి విముక్తి కలిగించమని రాముడిని కోరారు. రాముడు శత్రుజ్ఞుడికి యుద్ధ ప్రణాళిక వివరించి యుద్దానికి పంపాడు.
రామాయణం ఉత్తరకాండ – 9
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
వాల్మీకి మహర్షి సీతను ఆదరించి ఋషి కన్యలతో కలిసి ఉండమని సెలవిచ్చాడు. రాముడు వియోగంలో మునిగిపోయాడు. సీత రాములకు ఎందుకీ వియోగం అని లక్ష్మణుడు సుమంత్రుడితో అనగా, సుమంత్రుడు భృగుమహర్షి శాపం గురించి చెప్పాడు. రాముడు వియోగంతో బాధపడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని చింతిస్తూ లక్ష్మణుడితో అది చాలా తప్పు అని, ఉదాహరణకు కొన్ని కథలు చెప్పాడు.
రామాయణం ఉత్తరకాండ – 8
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
అగస్త్యుడు రామునికి వాలి సుగ్రీవుల పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు. సీత గర్భవతి అయింది, రాముడు కోరిక ఎమన్నా కోరామని అడుగగా, సీత ఋషుల ఆశ్రమాలు చూడాలని ఉంది అనగా రాముడు సరే అన్నాడు. ఈలోగా పురప్రజలు చేసే అపవాదులు విన్నాడు. ఆ అపవాదు ఇక్ష్వాకు వంశానికి చేటు అని గ్రహించి సీతను అడవులలో వదిలేసి రమ్మని ఆదేశించాడు.
రామాయణం ఉత్తరకాండ – 7
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
కార్తవీర్యార్జునిడి చేతిలో ఓడిన రావణుడికి ఇంకా మదం అణగలేదు. ప్రపంచమంతా తిరుగుతూ కనిపించిన వీరులందరితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఒకనాడు కిష్కిందకు వెళ్లి వాలిని సవాలు చేసాడు. వాలి రావణుడిని చంకనపెట్టుకుని నాలుగు దిక్కులా సముద్రాలలో ముంచి లేపాడు. రావణుడు వాలికి క్షమాపణ చెప్పుకుని అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నాడు. రాముడు హనుమను తలుస్తూ అంతటి మహాబలవంతుడు సుగ్రీవుడికి ఎందుకు సాయం చేయలేకపోయాడని అగస్త్యుడిని అడుగగా, హనుమ అద్భుతశక్తి గురించి ఇలా చెప్పసాగాడు…
రామాయణం ఉత్తరకాండ - 6
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
రావణుడి ఆగడాలకు హద్దు లేదు. ముల్లోకాలూ తిరుగుతూ యుద్ధం అందరితోనూ యుద్ధం చేసి గెలిచాడు. మార్గమున కనిపించిన అందగత్తెలు చెరపడుతూ అల్లకల్లోలం చేస్తున్నాడు. ఒకనాడు రంభ తారసపడితే బలవంతంగా చెరపట్టాడు, అది విని నలకూబరుడు “తనను కోరని స్త్రీని బలాత్కరిస్తే రావణుడికి తలా వెయ్యి చెక్కలవుతుంది” అని శపించాడు. రావణుడి విజయ పరంపరను కార్తవీర్యార్జునుడు అనే వీరుడు నిలదీసాడు.
రామాయణం ఉత్తరకాండ - 5
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
చావును శాసించే యముడికి చావుంటుందా? రావణుడు యముడిని చంపుతా అని యమలోకానికి వెళ్తున్నపుడు నారదుడు ఆతృతగా యుద్ధం చూడటానికి వెళ్ళాడు. యముడికి రావణునిదికి దారుణ యుద్ధం జరిగింది. ముల్లోకాలూ తల్లకిందులయ్యాయి.
రామాయణం ఉత్తరకాండ - 4
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
రావణుడికి కుబేరుడికి భయంకర యుద్ధం జరిగింది.రావణుడు మాయ యుద్ధం చేసి కుబేరుడిని ఓడించి పుష్పక విమానంలో శరవనానికి వెళ్తుండగా మార్గ మద్యంలో శివలోకం వచ్చింది. నంది రావణుడిని ఆపగా రావణుడు శివలోకాన్నే పెకలిస్తా అని కొండని ఎత్తపోయాడు. .
రామాయణం ఉత్తరకాండ - 3
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ నించి వరాలు పొందిన సంగతి పాతాళంలో ఉన్న సుమాలికి తెలిసింది. వెంటనే రాక్షసులను వెంటబెట్టుకుని రావణ వద్దకు వచ్చారు. రావణుడికి లంకను తిరిగి సంపాదించామని నూరిపోశారు.
రామాయణం ఉత్తరకాండ - 2
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
సుకేశుడి పుత్రులయిన మాల్యవంతుడు, మాలీ, సుమాలి లంకలో నివాసం ఏర్పరచుకుని వార గర్వంతో ముల్లోకాలనూ క్షోభపెట్టసాగారు. దేవతలందరూ విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, విష్ణువు వారిని సంహరిస్తా అని అభయమిచ్చాడు.
రామాయణం ఉత్తరకాండ - 1
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
రాముని పట్టాభిషేకం అయ్యి రాజ్య పాలన చేస్తుండగా అగస్త్య మహాముని అయోధ్య వచ్చారు. మునులందరూ ఇంద్రజిత్తుని లక్ష్మణుడితో సంహరించిన వైనం తమకు ఆశ్చర్యం కలిగించిందని అనేసరికి రాముడికి ఆశ్చర్యం కలిగి ఇంద్రజిత్తుని వృత్తాంతం చెప్పమని కోరాడు. దానికి అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు.
రామాయణం యుద్ధకాండ - 14
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
విభీషణుడు పుష్పక విమానంలో సీతారామ, లక్ష్మణులను అయోధ్య కు తీసుకువెళ్లబోతూ సీత కోరిక మేరకు మార్గమధ్యంలో కిష్కిందలో ఆగి సుగ్రీవుడి భార్యలను, ఇతర వానరప్రముఖులను అయోధ్యకు తీసుకువెళ్లారు. భరతుడు ఎంతో మర్యాదతో, వైభవంగా రాముని పట్టాభిషేకం చేశారు. రామరాజ్యం ఏర్పడింది. యుద్ధకాండ సమాప్తం
రామాయణం యుద్ధకాండ - 13
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
విభీషణ అనుమతి తీస్కుని లంకకి వెళ్లి, రావణ సంహారం చేసానని సీతకి చెప్పమని రాముడు హనుమకు చెప్పాడు. సీతను రాముడి వద్దకు చక్కగా అలంకరించి తీసుకువచ్చారు. పరాయి వాడి దగ్గర అంత కాలం ఉన్న సీతను స్వీకరించను అన్నాడు. సీత అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. ఇంకా అంత శుభమే!
రామాయణం యుద్ధకాండ - 12
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
లక్ష్మణుడు కొనప్రాణంతో ఉండగా, హనుమంతుడిని ఔషధీ పర్వతంపై ఉన్న ఔషదములు దొరక్క ఏకంగా పర్వతాన్నే పెకలించి యుద్ధరంగానికి తీసుకువచ్చాడు. ఆ ఔషదములకు లక్ష్మణుడికి ప్రాణం వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో రాముడు యుద్ధం ప్రారంభించాడు. అలా ఏడూ రాత్రులూ ఏడూ పగళ్ళూ యుద్ధం చేశారు. రాముడు దేవతలిచిన దివ్యమైన బాణాన్ని సాధించగా అది దుష్ట రావణుడి ప్రాణాలు హరించింది.
రామాయణం యుద్ధకాండ - 11
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
నికుంభుల హోమం చేస్తున్న ఇంద్రజిత్తును ఎవరైతే అడ్డగిస్తారో, వారి చేతిలోనే ఇంద్రజిత్తుకి చావు ఉందన్న విషయం విభీషణుడు రాముడుతో చెప్పాడు. దాంతో రాముడు, లక్షమునిడిని వెళ్ళమని అన్నాడు. లక్ష్మణుడికి, ఇంద్రజిత్తుకు, వనరులకు, రాక్షసులకు భయంకరమయిన యుద్ధం జరుగగా లక్ష్మణుడు ఒక తీవ్రమయిన బాణంతో ఇంద్రజిత్తును సంహరిస్తాడు.
రామాయణం యుద్ధకాండ - 10
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
కుంభకర్ణుడు, అకంపనుడు, అతికాయుడు, మకరాక్షుడు తదితర రాక్షసులందరూ చచ్చారు. ఇంద్రజిత్ రామ లక్ష్మణులను అంతమొందిస్తానని రావణుడికి ప్రమాణం చేసి భీకర యుద్ధం చేయనారంభించాడు.
రామాయణం యుద్ధకాండ - 9
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
సుగ్రీవుడు మూర్ఛనించి లేచి కుంభకర్ణుడి చెవులు చెక్కిళ్ళు కొరికేసి ఒక్క గెంతులో రాముడు వద్దకు ఎగిరాడు. కుంభకర్ణుడు రగిలిపోయి రామదండు మీదకు దండెత్తాడు. దొరికిన వారిని దొరికినట్టు తినేస్తున్నాడు.
రామాయణం యుద్ధకాండ - 8
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
కుంభకర్ణుడు అతి భయంకరంగా యుద్ధం చేయనారంభించాడు. వానర ప్రముఖులను చిత్తుగా ఓడించాడు. హనుమంతుడు వంటి పరాక్రమవంతులు కూడా కుంభకర్ణుడి శక్తికి పడిపోయారు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని మూర్ఛపుచ్చి లంకకు తీసుకువెళ్లాడు.
రామాయణం యుద్ధకాండ - 7
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
రావణ సైన్యంలో ఎందరో ప్రముఖ రాక్షషులు చచ్చారు. రావణుడికి ఏమి చెయ్యాలో పాలు పోక కుంభకర్ణుడిని నిద్రలేపమని ఆదేశించాడు. లంకాసేన కొండంత తినుబండారాలు, ఏనుగులు, గుర్రాలు వెంటబెట్టుకుని భేరీలు మోగిస్తూ కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తున్నారు
రామాయణం యుద్ధకాండ - 6
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
భీకర యుద్ధం ఆరంభమయింది. ఇంద్రజిత్తును యుద్ధరంగంలో అంగదుడితో తలపడి తరువాత మాయాయుద్ధం మొదలుపెట్టాడు. రామ లక్ష్మణుల మీదకు నాగాస్త్రం విడిచి వారిని కట్టి పడేసి సందులేకుండా బాణాలతో కొట్టాడు.. రామలక్ష్మణులు చనిపోయారని భావించి తిరిగి వెళ్ళాడు. వానర సేన శోకసముద్రంలో మునిగిపోయింది.
రామాయణం యుద్ధకాండ - 5
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
రావణుడు అతని మంత్రివర్గంలో కొంత మంది తన శ్రేయస్సు కోరి సీతను తిరిగి ఇచ్చెయ్యమన్నారు. రావణుడు ససేమిరా అని యుద్దానికి సిద్ధం అయ్యాడు. రాముడు శిబిరం యుద్ధ ప్రణాళిక చేసుకున్నారు.
రామాయణం యుద్ధకాండ - 4
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
రాముడి ఆజ్ఞ ప్రకారం, నలుడు ప్రణాళిక ప్రకారం వానరులు సేతువు నిర్మించారు. వానర సేన వారధి దాటి లంకకు చేరారు. రావణుడి శిబిరం గుబులుతో ఉండగా, రావణుడు వేగులను పంపిస్తూనే ఉన్నాడు విభీషణుడు వారిని గుర్తించి పట్టిస్తూనే ఉన్నాడు.
రామాయణం యుద్ధకాండ - 3
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time2 months ago
రాముడు విభీషణుడిని నమ్మి తన సేనలో చేర్చుకున్నాడు. రావణుడు శకుడనే రాక్షసుడిని వేగులాగా వెళ్లి వానర సేన బలమెంతో తెలుసుకుని రమ్మన్నాడు. శకుడు పక్షిలాగా పైన ఎగురుతుంటే వానరులు కనిపెట్టి కిందికి లాగేసారు… ఇంకా ఏమి జరిగిందో వినండి.
రామాయణం యుద్ధకాండ - 2
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
రవాణా సభలో విభీషణుడు నీటి బోధ చేయడానికి ప్రయత్నం చేసాడు, సీతని రామునికి మర్యాదగా అప్పచెప్పమని అన్నాడు. కానీ రావణుడికి ఆ మాటలు పడలేదు. తనకు నచ్చిన విధంగా మాట్లాడిన మంత్రుల మాట మాత్రమే విన్నాడు. విభీషణుడిని నన మాటలు అని అవమానించాడు. విభీషణుడు కొంత మంది మంచి రాక్షషులతో రాముని చేరడానికి వెళ్లారు. రాముడి అతన్ని చేరదీసాడు..
రామాయణం యుద్ధకాండ మొదలు
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
రాముడు హనుమంతుడు లంక గురించి చెప్పినదంత విని ఎంతో సంతోషించాడు. సముద్రాన్ని ఎలా అయినా దాటి లంక చేరి రావణాది రాక్షసులను హతమార్చేందుకు యుద్ధ ప్రణాళిక చేయమని సుగ్రీవుడితో అన్నాడు. మరోపక్క రావణాసురుడు తన మంత్రి వర్గంతో జరిగిన దారుణానికి విచారిస్తూ, బదులు యుద్దానికి సన్నాహమవుతున్నారు! యుద్ధకాండ మొదలు…
రామాయణం సుందరకాండ సమాప్తం
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
లంకను తగలబెట్టిన హనుమ సీతామాత వద్ద సెలవు తీసుకుని లంక నించి మహేంద్రగిరివైపుకు ఎగిరాడు. సింహనాదంతో మహేంద్రగిరి దగ్గర దిగి అంగదాది వానరులకు జరిగినదంతా వివరంగా చెప్పి కిష్కింధకు బయలుదేరారు. రాముడికి జరిగినదంతా వివరించి, సీతాదేవి సైన్యాన్ని వెంటబెట్టుకుని రావణవధ చేయమని కోరిందని అన్నాడు.
రామాయణం సుందరకాండ - 6
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
రావణుడు ఇంద్రజిత్తుని పంపగా, ఘోరమయిన యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు చివరకు బ్రహ్మాస్త్రం వదలగా, హనుమంతుడు రాష్ట్రానికి గౌరవం ఇచ్చి లొంగిపోతాడు. రావణుడు హనుమను చంపజాలగా విభీషణుడు వారించి, కేవలం దండించి పంపమని సూచన ఇచ్చాడు. “చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు” అన్న సామెత హనుమంతుడికి సొంతం!
రామాయణం సుందరకాండ - 5
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
సీత ఇచ్చిన చూడామణిని చేతి ఉంగరాన్ని ధరించి, రావణుడి పని పడదామని లంక విధ్వంసం మొదలుపెట్టాడు. జంబుమాలి, అక్ష కుమారుడు వంటి పరాక్రమవంతులయిన రాక్షషులను హతమార్చి లంకను దాదాపుగా ధ్వంసం చేసాడు
రామాయణం సుందరకాండ - 4
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
హనుమంతుడు ఒక్కసారిగా సీత దగ్గరకి వెళ్తే బయపడుతుందనుకుని శింశుపా వృక్షం పైనే కూర్చుని రామకథ అంతా చెప్పాడు. సీతకు రాముడిచ్చిన ముద్రికను చూపగా సీత అతన్ని నమ్మింది. రాముడు సీత కోసం ఎంతో వియోగం చెందాడని చెప్పాడు. సీత తన జ్ఞాపకంగా ఒక సన్నివేశం వివరించింది.
రామాయణం సుందరకాండ - 3
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
హనుమంతుడు అశోక వనంలో సీతను చూసి ఎంతో సంబరపడ్డాడు. కానీ దయనీయస్థితిలో ఉన్న సీతను చూసి ఎంతో బాధపడ్డాడు. రావణుడు తనకు లొంగమని వేదిస్తుండటం, రాక్షషులు తనని చంపుతా అని బెదిరించడం లాంటి సన్నివేశాలన్నీ చూసి హనుమంతుడి గుండె నీరయింది…
రామాయణం సుందరకాండ - 2
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
హనుమంతుడు రాత్రి వేళ సూక్ష్మ రూపము ధరించి లంక ప్రవేశించాడు. లంక మారుతిని ఆపగా మారుతి ఒక్క పోటుతో లంకను నెల కూల్చాడు. తరువాత లంకంతా గాలించి చివరికి అశోక వనం చేరాడు
రామాయణం సుందరకాండ - 1
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
హనుమంతుడు మాహేంద్రగిరిపైనుండి ఎగిరి లంకకు బయలుదేరాడు. మార్గ మధ్యమున మైనాకుడు సేదతీరమని ఆహ్వానించగా అది ఒక విజ్ఞమని తలచి, మరల వచ్చేప్పుడు సేద తీరుతానని చెప్పి ముందుకు వెడలెను. మార్గ మధ్యమున సురసను పెట్టిన పరీక్ష, సింహిక రాక్షసిని వధ చేసి సురక్షితముగా లంక చేరెను.
రామాయణం కిష్కిందకాండ సమాప్తం
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
సంపాతి అలా వానరులకు సాయం చేయగానే నిసకారమహర్షి చెప్పిన విధంగా అతనికి రెక్కలు మొలిచాయి. జాంబవతాదులకు కూడా విజయం కలుగుతుందని చెప్పాడు. కానీ వనరులకు లంకకు మధ్య ఉన్న అంతులేని సముద్రం చూసి దిగులు చెందారు. అందరూ హనుమను ప్రేరేపించగా మహేంద్రగిరిపై నించి లంక వైపు దూకడానికి సిద్దమవ్వగా ఈ కిష్కిందకాండ ముగిసింది.
రామాయణం కిష్కిందకాండ - 6
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వింధ్య పర్వతం పైన సీత దొరకలేదని విచారంతో, గడువు దాటిపోయిందని భయంతో ప్రాయోపవేశం చేసుకుందామని సిద్ధపడ్డారు. ఇంతలో సంపాతి అనే ఒక మహాపక్షి వారి కంట పడింది. సంపాతి జటాయు అన్న అని తెలుసుకుని జరిగినదంతా చెప్పగా, సంపాతి సీతని ఎవరు ఎత్తికెళ్లింది దివ్య దృష్టితో చూసి చెప్పేసాడు.
రామాయణం కిష్కిందకాండ - 5
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
సుగ్రీవుడు వనరులందరికి పదిహేను రోజుల్లో కిష్కిందకి రావాలని ఆదేశాన్ని ఇచ్చాడు. లక్షల కోట్ల సంఖ్యలో రకరకాల వానరులు కిష్కింధకు చేరాయి. సుగ్రీవుడు నలుదిక్కుల వారిని పంపి సీతాకోసం వెతకమన్నాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులు వెళ్లిన వానరులంతా సీత దొరకలేదని తిరిగివచ్చారు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖులు దక్షిణం వైపు వెళ్లారు. 6 నెలలు గడిచినా కానీ వారికి సీత జాడ తెలియలేదు.
రామాయణం కిష్కిందకాండ - 4
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
వాలిని హతమార్చాక, సుగ్రీవుడు కిష్కిందకి రాజయ్యాడు. రాముడు పరిసరాలకు దగ్గర్లో ఉన్న ప్రసరణ పర్వతం మీద గుహలో బస చేశారు. సుగ్రీవుడు భోగలాలసుడై రామునికి సాయం చేయడం మరిచాడు. రాముడు లక్ష్మణుడిని కిష్కిందకి వెళ్లి సుగ్రీవుడికి గుర్తు చెయ్యమన్నాడు…
రామాయణం కిష్కిందకాండ - 3
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
సుగ్రీవుడు చావుదెబ్బలు తిని వాలిని సంహరించలేదని రాముడి మీద ఆగ్రహించాడు. వాలి సుగ్రీవులు ఒకేలా ఉండడంచేత ఏమీ చేయలేకపోయానని చెప్పి, ఒక గజపుష్పి లతను ధరించి యుద్దానికి వెళ్ళమన్నాడు.
రామాయణం కిష్కిందకాండ - 2
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
సుగ్రీవుడు వాలి పరాక్రమాల గురించి రాముడికి చెప్పాడు. వాలి మహా పరాక్రమవంతుడు, దుందుభి అంతటి అతి బలవంతులని మట్టి కురిపించిన ధీరుడు. సుగ్రీవుడు రాముడి పరాక్రమాలను నిరూపించవలసిందిగా కోరగా, రాముడు 7 సాల వృక్షాలని చీల్చేలా ఒక్క బాణం సంధించే సరికి సుగ్రీవుడికి నమ్మలేనంత పనయింది…
రామాయణం కిష్కిందకాండ - 1
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వత పరిసరాలలోకి వచ్చినట్టు సుగ్రీవుడు చూసి వాలి పంపిన వారేమోనని బయపడి హనుమంతుడిని వారెవరో తెలుసుకోమని పంపాడు. హనుమంతుడు వారు రామలక్ష్మణులని, సాయం కోర వచ్చారని, మిత్రులు కావాల్సింది సుగ్రీవునకు సూచించాడు.
రామాయణం అరణ్యకాండ సమాప్తం
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
రామలక్ష్మణులు సీతను వెతుకుతూ వనమంతా గాలిస్తున్నారు. ఆలా వెతుకుతుండగా వారిని కబంధుడనే రాక్షసుడు పట్టి తినబోయాడు. అతన్ని వధించగా అతను ఒక దివ్య పురుషుడిగా అవతరించి వారికి రుష్యముఖ పర్వతమున ఉన్న సుగ్రీవుడనే వానర రాజుని కలవమని అదృశ్యమయ్యాడు
రామాయణం అరణ్యకాండ – 6
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
రావణుడు సీతను అపహరించి లంకకు చేర్చాడు. రాముడు మారీచుడు అరిచిన తీరు చూసి ఎదో కీడు గ్రహించి వెనుదిరిగి ఆశ్రమానికి వస్తుండగా లక్ష్మణుడు ఎదురొచ్చాడు. ఇద్దరూ కంగారుగా ఆశ్రమానికి వెళ్లేసరికి సీత కనపడలేదు. అడవంతా గాలిస్తుండగా జటాయువు గాయాలతో కొనఊపిరితో కనిసిపించాడు.
రామాయణం అరణ్యకాండ – 5
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
మాయలేడిని చూసిన సీత ముచ్చటపడి దానిని పెంచుకుంటా అని రాముడిని కోరగా, రాముడు మాయలేడి వెంటపడ్డాడు.
రామాయణం అరణ్యకాండ – 4
Telugu Stories by Kadachepta Kadachepta Team
access_time3 months ago
ఖరదూషణుల వధ సంగతి రావణుడికి తెలిసింది. రామలక్ష్మణ ప్రతాపం గురించి, సీత అందచందాల సంగతి తెలుసుకుని సీతను ఎత్తుకురావడానికి మారీచుడి దగ్గరకు వెళతాడు. మాయలేడి రూపంలో మారీచుడు పంచవటిలో తిరగసాగాడు.

Sign up for your FREE account and start creating your playlists, a library of your favorites, follow celebs, invite and share with friends and more.

Get 50% off for the next 24 hours on Raaga Premium!

Play your music in HD, ad free and unlimited downloads ..

Save 50%
Prefer music without ads? Try Premium.
Install App